Get 20% off this month when you try our services!

BREAKING NEWS
తాజా వార్తల కోసం చూడండి.. న్యూస్ పేజ్ తెలుగు దినపత్రిక
Get 20% off this month when you try our services!

తాజా వార్తల కోసం చూడండి.. న్యూస్ పేజ్ తెలుగు దినపత్రిక

డిజిటల్ చెల్లింపులకు సంబంధించి కీలక మార్పులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశానికి మార్గం సుగమం చేసే ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (సవరణ) బిల్లు-2026’ను లోక్‌సభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లు పాస్ అయింది. ప్రస్తుతం యూపీఐ సహా కొన్ని డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) వసూలు చేయకుండా చట్టపరమైన నిబంధన ఉంది. తాజా సవరణతో ఆ నిబంధన తొలగనుంది. దీంతో భవిష్యత్‌లో బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశం ఏర్పడింది.
ప్రస్తుతం ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై సేవా రుసుములు అమల్లో ఉండగా, యూపీఐకి మాత్రం మినహాయింపు ఉంది. కొత్త బిల్లుతో ఆ పరిస్థితి మారనుంది. అయితే ఈ ఛార్జీలు సాధారణ వినియోగదారులపై కాదు. నిర్దిష్ట పరిమితికి మించిన యూపీఐ లావాదేవీలు చేసే పెద్ద వ్యాపారులు, వ్యాపార సంస్థలకే వర్తించే అవకాశం ఉందని సమాచారం. డిజిటల్ చెల్లింపు వ్యవస్థను నిర్వహిస్తున్న బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు, మౌలిక సదుపాయాల సంస్థలకు ఆదాయం సమకూర్చడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఛార్జీల శాతం, ఏ స్థాయి లావాదేవీలకు వర్తిస్తాయనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు తర్వాత స్పష్టత ఇవ్వనున్నాయి.

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. ఏడు వారాల గరిష్ఠ స్థాయికి చేరి ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ (ప్రభుత్వ బాండ్లపై రాబడులు) తగ్గడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపారు. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న సంకేతాలు వస్తున్నప్పటికీ పసిడి ధర పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ లో అక్టోబర్ 5న ముగియనున్న ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర ట్రేడింగ్ ప్రారంభంలోనే 10 గ్రాములకు రూ.536 పెరిగి రూ.1,49,029 పలికింది. ట్రేడింగ్ కొనసాగుతుండగా ఒకానొక దశలో రూ.1,207 లాభపడి గరిష్ఠంగా రూ.1,49,700 స్థాయిని తాకింది. మరోవైపు వెండి ధరల్లో మిశ్రమ స్పందన కనిపించింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.813 పెరిగి రూ.2,28,397 వద్ద గరిష్ఠ స్థాయికి చేరినప్పటికీ ఆ తర్వాత లాభాలను నిలుపుకోలేకపోయింది.

ఆగస్ట్ 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
హైదరాబాద్, న్యూస్ పేజ్
కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రజలకు త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు కొత్త పీడీఎస్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. ఆ తరువాత రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిర్వహిస్తామని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.
ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నవారికే స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తేదీ ఫిక్స్ కావడంతో అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందేలా తుది లబ్ధిదారుల జాబితాల ధృవీకరణను (e-KYC) త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేసింది. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రిటింగ్ నుంచి జిల్లాలకు చేరే వరకు సురక్షితమైన రవాణా నిర్వహణపై పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా దాదాపు 1.05కోట్ల కుటుంబాలకు లామినేటెడ్ (పీవీసీ) రూపంలో రూపొందించిన కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డు వాటర్‌ప్రూఫ్ సౌకర్యంతో, క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డుల్లో క్యూఆర్ కోడ్‌తో పాటు ఆధునిక భద్రతా ఫీచర్లను కూడా పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పూర్తైన అనంతరం జిల్లా వారీగా సమగ్ర నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా ప్రస్తుతం రేషన్ కార్డు దారులకు మూడు నెలల బియ్యం ఇస్తున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించి బియ్యం ఇస్తున్నారు. ఆగస్ట్ 31 వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది.

డీప్‌ఫేక్ కంటెంట్‌ను దుర్వినియోగం చేయడంపై ఇటీవలే తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్, ఇప్పుడు ఆన్లైన్ వేధింపులపై మరో ముందడుగు వేశారు. సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడే వారిని గుర్తించి, వారి వివరాలను బహిర్గతం చేయాలని నెటిజన్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఆన్లైన్లో ఇతరులను వేధించే, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సృష్టించిన లేదా అంగీకారం లేకుండా తీసిన వ్యక్తిగత చిత్రాలను పంచుకునే అకౌంట్ల వివరాలను ట్యాగ్ చేయాలని మృణాల్ కోరారు. "ఇంటర్నెట్లోని ఈ మేధావుల కోసం ఓ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ నిర్మిద్దాం. వేధించే ఖాతాలను గుర్తిస్తే, వాటిని ట్యాగ్ చేయండి. ఇలాంటివి డాక్యుమెంట్ చేయడం చాలా అవసరం" అని తన పోస్టులో పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితమే డీప్‌ఫేక్‌పై మృణాల్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. "నా ఫొటోలను ఉపయోగించి డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టించడం లేదా పంచుకోవడం చట్టవిరుద్ధం, ఆమోదయోగ్యం కాదు. దీన్ని అధికారిక హెచ్చరికగా భావించండి. నా గుర్తింపును ఇంకెవరైనా దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అని ఆమె స్పష్టం చేశారు.

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఓ మైథాలాజికల్ జంగిల్ అడ్వెంచర్ చిత్రంలో ధనుష్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించనున్నట్లు టాక్. తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తెరకెక్కించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ దట్టమైన అడవి నేపథ్యంలో ఏనుగు చుట్టూ తిరిగే కథాంశంతో సాగనుంది. 2027 ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
ఒకవేళ కరీనా ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెబితే, ‘దేవదాస్’ నాటి నుంచి భన్సాలీతో ఉన్న రెండు దశాబ్దాల గ్యాప్‌కు ముగింపు పడనుంది. ప్రస్తుతం భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ పనుల్లో బిజీగా ఉండగా, ఆ చిత్రం పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

నవంబర్ 6న 'రామాయణ్' వర్సెస్ 'గాడ్జిల్లా మైనస్ జీరో
ఈ ఏడాది దీపావళికి ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద పోరుకు రంగం సిద్ధమైంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణ్', జపాన్ పాప్యులర్ ఫ్రాంచైజీ 'గాడ్జిల్లా మైనస్ జీరో' ఒకే రోజున, అంటే నవంబర్ 6న విడుదల కానున్నాయి. ఒకవైపు భారతీయ ఇతిహాసం, మరోవైపు గ్లోబల్ మాన్స్టర్ ఫ్రాంచైజీ తలపడుతుండటంతో ఈ సినిమా వార్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజాగా 'రామాయణ్' చిత్రబృందం ఓ ఇంగ్లీష్ ట్రైలర్‌తో పాటు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. దీపావళి పండుగను లక్ష్యంగా చేసుకుని, ధన్‌తేరాస్ పర్వదినమైన నవంబర్ 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శుక్రవారం ప్రారంభమై, వారాంతం, ఆ తర్వాత గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్ వంటి వరుస సెలవులు ఉండటంతో దేశీయ బాక్సాఫీస్ వద్ద 'రామాయణ్'కు భారీ వసూళ్లు దక్కే అవకాశం ఉంది.
స్వదేశంలో 'రామాయణ్' హవా నడిచినా, విదేశీ మార్కెట్లలో మాత్రం గట్టి పోటీ తప్పేలా లేదు. జపాన్‌కు చెందిన 'గాడ్జిల్లా మైనస్ జీరో' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. దీని ముందు భాగం భారీ విజయం సాధించడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. దీంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఈ రెండు సినిమాల మధ్య ప్రధాన పోటీ ఐమ్యాక్స్, ఇతర ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్ల కోసమే జరగనుంది.
తిరుమల, న్యూస్ పేజ్ : సెప్టెంబర్ 15 నుండి 23 వ తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ 9 రోజుల పాటు ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.
తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2013లో తన సహోద్యోగినిపై అత్యాచారం కేసులో ఆయనను న్యాయస్థానం దోషిగా తేల్చింది. 2021లో ట్రయల్ కోర్ట్ తరుణ్ తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో సవాలు చేసింది. ఈ అప్పీల్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జంసాండేకర్లతో కూడిన ధర్మాసనం ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేసింది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన అదనపు టారిఫ్‌లను యూఎస్ సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తోంది. ఇప్పటికే 100 బిలియన్ డాలర్లకు (రూ.9.5 లక్షల కోట్లకుపైగా) పైగా సొమ్మును తిరిగి ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రీఫండ్‌గా తెలుస్తోంది.
రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం, అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్ పలు దేశాలపై భారీ దిగుమతి సుంకాలు విధించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. దేశంలోనే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, పల్లె నుంచి పట్టణం వరకు రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
మహిళల ఆసియా కప్ 2026 షెడ్యూల్‌ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధికారికంగా గురువారం (ఆగస్టు 6, 2026) విడుదల చేసింది. ఈ టోర్నమెంట్లో అత్యంత ఉత్కంఠరేపే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 5న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్న ఈ టీ20 ఫార్మాట్ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. సెప్టెంబర్ 13న ఫైనల్ పోరు జరగనుంది.
ఆసియా క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్లలో భారత రన్ మిషన్ విరాట్ కోహ్లీ 40 విజయాలతో ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల వెస్టిండీస్‌పై విజయం సాధించడం ద్వారా పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్ టెస్టుల్లో తన 11వ విజయాన్ని నమోదు చేసి జాబితాలో చేరాడు. ఎంఎస్ ధోనీ 27 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. మిస్బా ఉల్ హక్ (26), సౌరవ్ గంగూలీ (21) వరుసగా తదుపరి స్థానాల్లో ఉన్నారు.
శ్రీలంకతో జరగబోయే ప్రతిష్టాత్మక రెండు టెస్టుల సిరీస్ కోసం భారత పురుషుల క్రికెట్ జట్టు కొలంబో చేరుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఆటగాళ్లకు లంక క్రికెట్ బోర్డు అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత ఆటగాళ్లు కొలంబోలో బస చేసి ఆపై ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొననున్నారు. గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎంపికైన జమ్మూ పేసర్ ఆకిబ్ నబీ కూడా జట్టుతో పాటు లంకలో ల్యాండ్ అయ్యాడు.
భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్ 2026తో ముగియనుండటంతో అతడి భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటన సమయంలో రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై తలెత్తిన వివాదాల కారణంగా బీసీసీఐ అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ అగార్కర్‌ను తప్పిస్తే, అతని స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలని బోర్డు యోచిస్తోందట.
Add a footnote if this applies to your business

చీఫ్ ఎడిటర్ & ఎండీ
జర్నలిజంలో 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం.
Ph : 93929 33338
పక్షపాతం లేని వార్తల ప్రవాహం న్యూస్ పేజ్ దినపత్రికకు చందాదారులుగాకండి. పత్రిక అభివృద్దిలో పలుపంచుకోండి.
మార్కెట్లోనే మునుపెన్నడూ లేని విధంగా అతితక్కువ ధరల్లో యాడ్స్ న్యూస్ పేజ్ ప్రత్యేకత.
నిత్యం వేలాది మంది పాఠకులకు వార్తలు అందిస్తున్న న్యూస్ పేజ్ దినపత్రిక మరియు డిజిటల్ న్యూస్ ద్వారా మీరు ప్రపంచానికి చేరువకండి. మీ వార్తలు న్యూస్ పేజ్ లో పబ్లిష్ చేయాలనుకుంటే వెంటనే మా టీమును సంప్రదించండి.
మీరు విలేకరిగా మారాలనుకుంటున్నారా? అయితే మాతో చేరండి. మీ వార్తలు ప్రపంచానికి తెలిసేలా చేయండి.
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.